జేసీ ఎంపీగా ఉండేది ఇక 26 రోజులే...!

Update: 2017-12-05 11:01 GMT

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ఇక ఎంపీగా కొనసాగేది కేవలం 26 రోజులేనా? అవును. ఇది నిజం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఈ ఏడాదే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇటీవల జేసీ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ తాను ఈ ఏడాదే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది అంటే ఇక 26 రోజులు మాత్రమే సమయం ఉంది. అంటే ఎంపీగా జేసీ రాజీనామా చేస్తారా? లేక రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు డిసెంబర్ 31వ తేదీన ప్రకటించనున్నారా? అన్న టెన్షన్ ఆయన అనుచరుల్లో నెలకొంది. తాను రాజకీయాల నుంచి వైదొలిగి వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు.

Similar News