జనసేనానికి నీటిగండం ...?

Update: 2018-02-15 03:30 GMT

రెండు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా రెపరెప లాడించాలని ఆ పార్టీ అధినేత ప్రణాళిక. అయితే జనసేన ఏదో ఒక రాష్ట్రానికి పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం ఇరు రాష్ట్రాల నడుమ రాబోయే నీటి యుద్ధం జనసేనకు గండంగా మారే పరిస్థితులు ప్రస్ఫుటించేలా మారుతుంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా సమస్యలు మాత్రం ఇప్పటికి విడిపడలేదు. ప్రాజెక్టుల్లో నీటి పంపకాలు, విధ్యుత్, ఆస్తుల విభజన, ఇంకా అనేక అంశాలపై రెండు రాష్ట్రాల నడుమ జాతీయ స్థాయిలో పంచాయితీలు నడుస్తున్నాయి.

కృష్ణ, గోదావరి జలాల్లో .....

కృష్ణా లో, గోదావరిలో తమకు న్యాయంగా కేటాయించాలిసిన నీరు ఇచ్చేయాలంటుంది తెలంగాణ సర్కార్. దాదాపు 575 టిఎంసి ల నీటిని ఇవ్వాలని కేంద్ర జలవనరుల శాఖకు ఇప్పటికే స్పష్టం చేసింది. దీనిపై జలమండలి ఆధ్వర్యంలో కృష్ణా బోర్డు ముందు పంచాయితీ మొదలు పెట్టింది తెలంగాణ. తెలంగాణ భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ఏపీ ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదులను, ఆరోపణలు, విమర్శలు కొట్టిపారేశారు. ఒక్క కృష్ణా నదీజలాలు కాకుండా గోదావరిలో మా వాటా తేల్చాలంటుంది తెలంగాణ. పట్టిసీమ, పోలవరం ద్వారా వచ్చే నీటిలో వాటాను కోరుతుంది.

ఈ సెంటిమెంట్స్ జనసేన కు ఇబ్బందే ...

నిన్న మొన్నటివరకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా పవన్ తన వ్యవహారశైలి సాగించారు. అయితే ఇటీవలే ఆయన రూట్ మార్చారు. ఏది ఏమైనప్పటికి పవన్ ఇరు రాష్ట్రాల్లో ఏ వైపు వున్నా పార్టీ పరంగా ఇబ్బందులు పడే అవకాశాలు మెండుగా వున్నాయి. ఇప్పటికే టిడిపి, వైసిపి పార్టీలు తెలంగాణ లో దాదాపు దుకాణం బంద్ చేశాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ వైపు మాట్లాడినా ఏపీ వైపు మాట్లాడినా పవన్ చిక్కుల్లో పడతారు. అలా అని ఎటువైపు తన మద్దత్తు ప్రకటించకుండా వున్నా చేతగాని పార్టీగా జనం గుర్తించే అవకాశాలు ఉంటాయన్న ఆందోళన జనసేన క్యాడర్ లో నెలకొనివుంది. మరి జనసేనాని ఈ చిక్కు ముడి నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

Similar News