ఈ నెల 31వ తేదీ నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే మేడారం భక్తులతో కిటకిట లాడుతోంది. మూడు రోజుల్లో వెళ్లలేమనుకున్న భక్తులు ముందుగానే వనదేవతలను దర్శించుకుంటున్నారు. నిన్న ఆదివారం కావడంతో లక్షల సంఖ్యలో భక్తులు మేడారం చేరుకున్నారు. దీంతో మేడారం దారులన్నీ కిటకిట లాడాయి. ఇప్పటికే గత వారం రోజుల నుంచి నలభై లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారని అంచనా. పండగ మూడు రోజుల్లో కోటి మంది వరకూ భక్తులు వస్తారని భావించిన అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర సమయంలో తెలంగాణలో అధికారులందరూ అక్కడే ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇక పోలీసులు కూడా మేడారం జాతరకు వన్ వే రూట్ ను ఏర్పాటు చేశారు. ఈ దారిలోనే భక్తులు వెళ్లి రావాల్సి ఉంటుంది. మేడారం వెళ్లే భక్తుల కోసం తెలుగుపోస్ట్ ప్రత్యేకంగా ఆ వివరాలను అందిస్తుంది.
మేడారం జాతర...వన్ వే రూట్ వివరాలు...
👉 వరంగల్, హన్మకొండ మీదుగా వచ్చే వాహనాలు ములుగు, పసర, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకుంటాయి,
👉 తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్క పేట, గోళ్లబుద్ధరం కమలాపురం క్రాస్ మీదుగా భూపాలపల్లి, రేగొండ, పరకాల,గుడేపాడ్ మీదుగా హన్మకొండకు చేరుకుంటారు,...
👉 గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపెల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం కాటారం మీదుగా వచ్చే వాహనాలు, భూపాలపల్లి,ములుగు ఘన్ పూర్, జంగాల పల్లి నుంచి పసర, నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకుంటాయి
👉 తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, బయ్యక్కపేట, కమలాపురం క్రాస్ నుండి కాటారం లేదా కాల్వపల్లి, సింగారం, బోర్లగూడెం, పెగడ పల్లి, చింతకాని,మీదుగా కాటారం, చేరుకోవచ్చు.
👉 ఛత్తీస్ ఘడ్, భద్రాచలం, మణుగూరు నుంచి వాహనాలు, ఏటూరు నాగారం, చిన్న బోయినపల్లి, కొండయి, ఉరట్టం మీదుగా మేడారం చేరుకుని, తిరుగు ప్రయాణంలో ఇదే దారిలో వెళ్ళిపోతారు.
👉 మహబూబాబాద్ నుంచి వచ్చే వాహనాలు, నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లి హైవే దగ్గర కలిసి, ములుగు, పసర, నార్లాపూర్, మీదుగా, మేడారం చేరుకుని,
👉 తిరుగు ప్రయాణంలో నార్లాపూర్, కమలాపూర్ క్రాస్, భూపాలపల్లి, పరకాల, గుడెప్పాడ్ మీదుగా మళ్ళీ మల్లంపల్లి మీదుగా తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు..