బీహార్ అంటే నే స్పెషల్. దేశంలో గన్ కల్చర్ కి ప్రయివేట్ ఆర్మీలకు పెట్టింది పేరు బీహార్. అలాంటి బీహార్ లో మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభ కోణం కేసులో శిక్ష ఖరారు కావాలిసివుంది. రాంచి సిబిఐ కోర్ట్ లో గడ్డి కుంభ కోణంలో లాలూ నేరం చేశారని జడ్జ్ శివపాల్ సింగ్ తీర్పు చెప్పేశారు కూడా. కాకపోతే ఎంతకాలం ఈ కేసులో నేరస్థులకు శిక్ష పడనుందో ఇంకా న్యాయమూర్తి తీర్పు చెప్పలేదు. వాస్తవానికి ఈ కేసు తీర్పు ఇచ్చే సమయానికి న్యాయవాది ఒకరి మరణంతో తీర్పు వాయిదా పడింది.
దొరికిన సమయాన్ని లాలూ గ్యాంగ్ ...
శిక్ష ఖరారు అయ్యి నిర్ధారణ కావాల్సిన సమయం నడుమ గ్యాప్ దొరకడంతో లాలూ మాఫియా రంగంలోకి దిగింది. ఈ కేసును విచారించి తుది తీర్పు చెప్పాలిసిన జడ్జి శివపాల్ సింగ్ కి లాలూ అనుచరుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ మొదలైపోయాయి. ఈ బెదిరింపులను స్వయంగా జడ్జి కోర్ట్ లో బయటపెట్టారు. తాను చట్ట ప్రకారం నడుచుకుంటున్నానని ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని జడ్జి స్పష్టం చేసేసారు. జడ్జి తన బెదిరింపులు అంశం బయట పెట్టినప్పుడు అక్కడే వున్న లాలూ మనసుతో తీర్పు చెప్పండి అంటూ కూల్ గా వ్యాఖ్యానించడం గమనార్హం.