జగపతి బాబుకి ఏమైంది ...?

Update: 2017-11-20 03:30 GMT

ప్రముఖ సినినటుడు జగపతి బాబుకి ఏమైంది ? ఎందుకోసం ఆయన మౌన పాదయాత్రలు సంకల్పించారు. ఆ మౌనం ద్వారా ఏమి చెప్పదలచుకున్నారు ? ఎవరిమీద ఆయనకు కోపం వచ్చింది ? ఎందుకు ఆయన ఇలా మారిపోయారు ? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే జగపతి బాబే నోరు విప్పాలి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఒక్కప్పటి హీరో నేడు టాప్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న జగపతిబాబు వైజాగ్ లో మౌన యాత్ర చేపట్టినందునే . ఆయన ఇది ఎందుకు చేశారో ఎవరికి అర్ధం కాలేదు.

ఎందుకో ఈ యాత్రలు....?

ఆయన కూడా చెప్పలేదు. ముక్కుసూటిగా మాట్లాడటం, కుండబద్దలు కొట్టినట్లు విషయాలను చెప్పడం, రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా ఉల్లాసంగా గడపడానికి ఇష్టపడతారు జగపతి బాబు. అలాంటిది సడెన్ గా ఆయన మౌన యాత్ర ల వెనుక పరమార్ధం ఏమిటో ఎవరికి తెలియడం లేదు. వైజాగ్ తరువాత మరికొన్ని నగరాల్లో కూడా జగపతి బాబు ఇలాంటి మౌన యాత్రలు చేయనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నా అలా చేయడానికి కారణాలు మాత్రం చెప్పకపోవడం విశేషం.

Similar News