వైసీపీ అధినేత జగన్ చిన్న వయస్సు. అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి వైఎస్ మరణం.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక సొంత పార్టీని పెట్టుకున్నారు. గత 26 రోజులుగా వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఈ పాదయాత్రలో ఆయన ఒక సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. వైసీపీ అధినేత జగన్ గతంలో ఏ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఆయన ఎక్కువగా బ్లూ రంగు చొక్కాను ధరించే వారు. యువభేరి జరిగినా.. పార్టీ తరుపున ఏ కార్యక్రమం జరిగినా ఆయన ఎక్కువగా నీలం రంగు చొక్కానే వేసుకునే వారు. కాని గత 26 రోజులుగా జరుగుతున్న పాదయాత్రలో జగన్ తెలుపురంగు చొక్కానే ధరిస్తుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జగన్ కు బ్లూ రంగు అంటే ఇష్టమని, ఎక్కువగా ఆయన ఆ కలర్ వస్త్రాలనే ధరిస్తుంటారని ఆయనకు అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. కాని పాదయాత్ర లో మాత్రం వేరే కలర్ జోలికి జగన్ పోలేదు. ఇప్పటివరకూ జరిగిన పాదయాత్రలో జగన్ కేవలం తెలుపురంగు చొక్కానే ధరిస్తుండటం ఆయన సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
నిన్న నడక నెమ్మదిగా.....
వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలుపు రంగు శాంతికి చిహ్మమని భావించడం, కొందరు అదే రంగు వాడమని సూచించడంతోనే ఆయన ఇతర రంగుల జోలికి పోవడంలేదని పార్టీలో కూడా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జగన్ పాదయాత్ర సాగుతోంది. మొత్తం 8 నియోజకవర్గాల్లో 250కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేయనున్నారు. నిన్న కేవలం 11.3 కిలోమీటర్ల మేరకే పాదయాత్ర చేయడం విశేషం. ఎక్కువగా కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో జగన్ పాదయాత్ర వేగంగా ముందుకు సాగలేదు. రాత్రికి అనంతపురం జిల్లా గుత్తిలో బస చేసిన జగన్ రేపు ఉదయం 8గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. రేపు కూడా గుంతకల్ నియోజకవర్గంలోనే జగన్ పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం గుత్తినుంచి యాత్రను ప్రారంభించే జగన్ అవులంపల్లి క్రాస్ రోడ్స్, పెద్దవడుగురు మీదుగా చిన్న వడుగురు వరకూ కొనసాగనుంది.