జగన్ వైఖరినే పరిస్థితులు మార్చేశాయా?

Update: 2017-10-08 06:30 GMT

రాజకీయాలు ఎప్పుడు ఒకేలా వుండవు . పరిస్థితులు ఎవరినైనా మార్చేస్తాయి . దీనికి ప్రత్యక్ష ఉదాహరణ వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి . ఆయనెప్పుడూ పోయేవాళ్లను ఆపిన పాపానికి పోలేదు. పార్టీకి ఎవరు గుడ్ బై కొడతారో ముందే తెలిసినా జగన్ చలించింది లేనేలేదు. పార్టీ పెట్టిన రోజు నేను మా అమ్మే వున్నాం . తరువాత అందరు వచ్చారు . ఎవరున్నా లేకపోయినా నా పోరాటం కొనసాగుతుంది అనే ధోరణిలోనే సాగిపోతూ వచ్చారు జగన్. ఈ క్రమంలోనే జగన్ ను నమ్ముకున్న సీనియర్ నేతలు సబ్బం హరి వంటి వారు వైసిపిని వీడినా ఆయన పట్టించుకోలేదు.

రాజకీయంగా తగిలిన దెబ్బలు రాటుదేల్చాయా ...?

వైసిపి స్థాపించిన నాటినుంచి దేశంలో ఏ పార్టీ అధినేత ఎదుర్కొని కష్టాలను జగన్ చాలా తక్కువ కాలంలోనే చవిచూశారు. ఆ అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకున్న ఆయన ఇటీవల పార్టీ మారిపోతున్నారని టిడిపి మీడియా ప్రచారంలో వున్న రాయలసీమ నేతలతో సమావేశం అయ్యారు . వారిని బుజ్జగించి భవిష్యత్తు పై భరోసా కల్పించారు . ఈ తరహా జగన్ వైఖరికి పూర్తి విరుద్ధమని పార్టీ వర్గాలే విస్మయం చెందుతున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లాల వారీగా ఇదే విధమైన సమీక్షలు నిర్వహించాలని వైసిపి భావిస్తుంది ట. తాజాగా కర్నూల్ జిల్లా నాయకులతో అయిన సమావేశం సజావుగా సాగడంతో జగన్ అందరిని కలుపుకునే వెళ్లాలని నిర్ణయించడంతో వైసిపి లో కొత్త జోష్ మొదలైంది .

Similar News