జగన్ వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదు?

Update: 2017-11-30 01:30 GMT

జగన్ పాదయాత్ర 22వ రోజుకు చేరుకుంది. అయితే వరుసగా ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలను టీడీపీ లాగేసుకుంటుండటంతో జగన్ ఆ విషయాలనే ప్రస్తావించడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళుతున్నప్పటికీ తాను మనోస్థైర్యాన్ని కోల్పోలేదనే సంకేతాలు ఇచ్చే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభమై 22 రెండు రోజులవుతుంది. ఈ సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. అయితే జగన్ ఎక్కడా వీరి గురించి ప్రస్తావన తేవడం లేదు. వెళ్లిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడకుండా వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారు జగన్. అయితే ఇందుకోసం ఆయన కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. పార్టీని వీడి ఎమ్మెల్యేలు వెళుతున్నా తాను పర్యటించే నియోజకవర్గాల్లో నేతలను వెంట పెట్టుకుని మరీ సభల్లో కన్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది వీరే అని స్పష్టంగా ప్రకటించకపోయినా.. వారినిపక్కనే పెట్టుకోవడంతో వీరే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి అని ప్రజలకు పరోక్ష సంకేతాలు పంపుతున్నారు. ఆళ్లగడ్డ, బనగానపల్లి, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో అదే జరిగిందంటున్నారు. ఇక కోడుమూరులో ఏకంగా పార్టీ అభ్యర్థిగా చెరుకులపాడు శ్రీదేవిని ప్రకటించారు.

ట్రిపుల్ సెంచరీ చేసిన జగన్....

పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు తనపై బురద జల్లుతున్నా ఆయన స్పందించకపోవడంపై వైసీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ పై మాత్రం జగన్ విరుచుకుపడుతున్నారు. ఇక తర్వాత పాదయాత్ర ప్రారంభమయ్యేది అనంతపురం జిల్లాలోనే. అయితే ఇప్పటికే ఆ జిల్లాపై టీడీపీ కన్నేసింది. మాజీలను టీడీపీలో చేర్చేందుకు సిద్ధమయింది. ఇక వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 22వ రోజు ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కారుమంచి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. కారుమంచి, వెంగళరాయ దొడ్డి, కైరుప్పల మీదుగా యాత్ర కొనసాగుతుంది. భోజన విరామం అనంతరం కుప్పలదొడ్డి, బిల్లకల్ వరకూ పాదయాత్ర చేరుకుంటుంది. బిల్లకల్ లో జగన్ రాత్రి బస చేయనున్నారు. ఆలూరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర కొనసాగనుంది. జగన్ పాదయాత్ర 300 కిలోమీటర్లకు చేరుకుంది. ఎమ్మిగనూరు నియోజకవర్గం బి అగ్రహారం వద్ద జగన్ 300 కిలోమీటర్ల మైలురాయినిదాటేశారు. నవంబర్ 6వ తేదీన ఇడుపుల పాయలో ప్రారంభమైన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 300 కిలోమీటర్లు దాటడంపై ఆ పార్టీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News