జగన్ రాలేనన్నాడు.. చంద్రబాబు కుదరదన్నారు

Update: 2017-12-13 03:45 GMT

సమాచార కమిషనర్ల నియామకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్రిసభ్య కమిటీ ఈరోజు భేటీ కాననుంది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల, ప్రతిపక్ష నేత జగన్ ఉన్నారు. అయితే జగన్ ను ఈ ఎంపిక కమిటీ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ప్రభుత్వం జగన్ ను ప్రభుత్వం కోరింది. అయితే జగన్ మాత్రం తాను పాదయాత్రలో ఉన్నందున రాలేనని, తన ప్రతినిధిని పంపిస్తామని జగన్ ప్రభుత్వానికి తెలిపారు. చీఫ్ కమిషనర్ తో పాటు సమాచార కమిషనర్ల నియామకం జరగాల్సి ఉంది. అయితే జగన్ తరుపున ప్రతినిధిని మాత్రం ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీంతో తాము ఎంపిక చేసిన సభ్యుల వివరాలను ప్రభుత్వం జగన్ కు తెలిపే అవకాశముంది. జగన్ సమావేశానికి రాకపోయినా ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు, యనమల భేటీ అయి సమాచార కమిషనర్ల నియామకానికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే కమిటీలోని సభ్యులే విధిగా ఈ సమావేశానికి హాజరు కావాలన్న నిబంధన ఉండటంతో జగన్ ప్రతినిధిని మాత్రం సమావేశానికి అనుమతించేది లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయ. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సమాచార కమిషనర్లను నియమించింది.

Similar News