జగన్ ప్లకార్డు పట్టుకుని మరీ....!

Update: 2018-02-08 03:52 GMT

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరగుతున్నాయి. బస్సులు ఎక్కడికక్కడే ఆర్టీసీ డిపోల్లోనే నిలిచిపోయాయి. ఉదయాన్నే వామపక్ష కార్యకర్తలు బస్సు డిపోల ఎదుట ధర్నా చేసి ఆందోళన చేశారు. దీంతో బస్సులన్నింటినీ ఆర్టీసీ స్వచ్ఛందంగా ఆపివేసింది. ఈ బంద్ లో వామపక్షాలతో పాటు కాంగ్రెస్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా పాల్గొంటున్నాయి. దీంతో బంద్ పూర్తిగా విజయవంతమయ్యే అవకాశముంది.

బంద్ లో టీడీపీ....

ఏపీ స్థంభించిపోయింది. ఏపీలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. విద్యాసంస్థలను మూసివేశారు. దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. పార్లమెంటులో ఎంపీల ఆందోళనకు సంఘీభావంగా టీడీపీ కూడా మండల కేంద్రాల్లో నిరసనలు తెలుపుతోంది. టీడీపీ కూడా వామపక్షాలు పిలుపు నిచ్చిన బంద్ కు మద్దతు తెలిపింది. దీంతో బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అదనపు బలగాలను తెలంగాణ నుంచి రప్పించారు.

నెల్లూరులో జగన్...

ఇక బంద్ కు మద్దతిస్తూ వైసీపీ అధినేత జగన్ ఈరోజు పాదయాత్రకు విరామమిచ్చారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎష్ మండలం దుండిగం క్రాస్ రోడ్స్ లో ఉన్న జోలగుంట పల్లి శివారులో వైఎస్ జగన్ స్వయంగా పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ఆయన ప్లకార్డులు పట్టుకుని బంద్ లో పాల్గొనడం విశేషం. బంద్ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం స్థంభించిపోయింది. ప్రధాన పట్టణాలన్నీ బోసి పోయి కన్పిస్తున్నాయి. ఏపీలోని 13 జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది.

Similar News