జగన్ పోయిన చోటనే వెతుక్కుంటున్నారా?

Update: 2017-11-29 01:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో పోగొట్టుకున్న సీటును దక్కించుకునేందుకు జగన్ ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి జయ నాగేశ్వర్ రెడ్డి గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన కె.చెన్నకేశవరెడ్డి కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు. రాజీనామా చేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ చెన్నకేశవరెడ్డి విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి కె. జగన్మోహన్ రెడ్డి పోటీ చేశారు. సుమారు 14 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో జగన్ తిరిగి ఈ నియోజకవర్గాన్ని చేజిక్కించుకునేందుకు పాదయాత్ర ద్వారా విపరీతంగా శ్రమిస్తున్నారు. స్థానిక నేతలతో రాత్రి వేళ చర్చలు జరుపుతున్నారు. ముఖ్య నేతలతో ముచ్చటిస్తున్నారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్....

మరోవైపు జగన్ పాదయాత్ర నేటి ఉదయం 8.30గంటలకు ఐ.కొండ క్రాస్ రోడ్డుకు చేరుకుంటుంది. తర్వాత గంజిహల్లికి చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం భోజన విరామం అనంతరం మధ్యాహ్నం బైలుప్పలకు చేరుకుంటారు. సాయంత్రం 4.30గంటలకు బి. అగ్రహారం లో పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. జగన్ పాదయాత్రకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మంచి స్పందన వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రజలు, వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సమస్యలను జగన్ కు చెప్పుకుంటున్నారని వారంటున్నారు. మొత్తం మీద జగన్ ఎమ్మిగనూరులో జెండా మళ్లీ పాతడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి మరి.

Similar News