జగన్ పై జేసీ సంచలన వ్యాఖ్యలు

Update: 2017-11-26 15:14 GMT

వైసీపీ అధినేత జగన్ పై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. జగన్ పాదయాత్ర కంటే జ్యోతిలక్ష్మి సభలకు జనం ఎక్కువగా వస్తారని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ తాను చిన్నప్పటి నుంచి చూశానని, అందుకే ఏకవచనంతో పిలుస్తానని జేసీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లోచంద్రబాబు తనకు టిక్కెట్ ఇస్తారని నమ్మకం లేదని జేసీ చెప్పారు. చంద్రబాబుతో పోటీ పడే వ్యక్తి జగనేనని అని ఆయన అన్నారు. జగన్ కు పట్టుదల లేదన్నారు. ఎంతసేపటికీ సీఎం అయిపోవాలన్న తపన తప్పించి వేరే ఆలోచన లేదన్నారు. జగన్ వచ్చేసారి కూడా సీఎం కాలేరని జేసీ జోస్యం చెప్పారు. జగన్ తాను గెలిచినా సీఎం అయ్యేంత సీన్ లేదన్నారు జేసీ. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో్ ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీదే గెలుపని, చంద్రబాబు సీఎం అని జేసీ చెప్పారు.

Similar News