వైసీపీ అధినేత జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం శ్రీవారి నైవేద్యం సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ ను తిరుమల వేద పండితులు ఆశీర్వదించారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఇడుపుల పాయ నుంచి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్ జగన్ తిరుమల చేరుకుని శ్రీవారికి మొక్కుకున్నారు. ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఆయన శ్రీవారిని కోరారు.జగన్ వెంట విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిధున్ రెడ్డి రోజా తదితరులు ఉన్నారు. రంగనాయకుల మండపం చేరుకున్న జగన్ ను వేదపండితులు ఆశీర్వదించారు.
శ్రీవారిని దర్శించుకున్న జగన్.....
అయితే జగన్ పేరు మార్చుకుంటున్నట్లు వస్తున్న వార్తలను వైసీపీ నేతలు ఖండించారు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతున్న జగన్ పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని వైసీపీ నేతలు కోరారు. ఇడుపుల పాయ నుంచి ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జగన్ ప్రజాసంకల్ప యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను నేతలు కోరారు. కాగా జగన్ ను రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం జగన్ కడపకు బయలుదేరి వెళ్లారు.