జగన్ పక్కన చోటుంటే చాలా?

Update: 2017-12-14 01:30 GMT

వైసీపీ అధినేత జగన్ 35వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికి 34 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఇక ఆత్మీయ సమావేశాలు, కుల సమావేశాలను కూడా తన పాదయాత్రలోనే నిర్వహిస్తున్నారు. బీసీలు, డ్వాక్రా మహిళలు, ముస్లింలు ఇలా అన్ని సామాజిక వర్గాల నేతలతో జగన్ మమేకం అవుతున్నారు. ముఖ్యంగా జగన్ పాదయాత్ర కొన్ని గ్రామాలు, పట్టణాలనే టచ్ చేస్తుండటంతో తమ ప్రాంతానికి కూడా రావాలని జగన్ ను వచ్చి ఆ ప్రాంత ప్రజలు అభ్యర్థిస్తుండటం కన్పించింది. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని జగన్ సంకేతాలు ఇస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగుతాయని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. మరో వైపు అభ్యర్థులను కూడా నేరుగా పరిచయం చేయకపోయినా ఎక్కడికక్కడ నియోజకవర్గ ఇన్ ఛార్జులను తన పక్కనే నిలుచోబెడుతుండటంతో వారిలో కూడా జోష్ నెలకొంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒక్క పత్తికొండ నియోజకవర్గానికి ఒక్క శ్రీదేవినే అభ్యర్థిగా నేరుగా ప్రకటించారు. మిగిలిన వారందరినీ తన వెంట తీసుకెళుతున్నారు. దీంతో అసెంబ్లీ సీట్లను ఆశిస్తున్న నేతలు జగన్ పక్కన చోటు దక్కిందని అమితానందపడుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ అక్కడి ఇన్ ఛార్జి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి మాట్లాడుతూ జగన్ సీఎం అయిన తర్వాతనే తాను తుది శ్వాస విడుస్తానని భావోద్వేగంతో చెప్పారు. గత ఎన్నికల్లో పరిటాల సునీతపై ఏడువేల ఓట్ల తేడాతో ప్రకాశ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సర్వే చేసి మొదటి విడత జాబితాను అందించినట్లు సమాచారం. సర్వే నివేదిక ప్రకారమే జగన్ వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది.

35వ రోజు యాత్ర షెడ్యూల్....

వైఎస్ జగన్ పాదయాత్ర నేటికి 35వ రోజుకు చేరుకుంది. ప్రజాసంకల్ప యాత్ర రాప్తాడు నియోజకవర్గంలో కొనసాగుతుంది. నేటి ఉదయం రాప్తాడు మండలం గంగలకుంట నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇదే నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ మండలం కందుకూరుకు చేరుకుంటుంది. అక్కడ పార్టీ జెండాను జగన్న ఎగురవేస్తారు. అనంతరం హంపాపురం క్రాస్ రోడ్డకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామానికి ఆగుతారు. తర్వాత చిగిచర్ల వరకూ పాదయాత్ర కొనసాగించి అక్కడే రాత్రి బస చేస్తారు.

Similar News