జగన్ ను పట్టించుకోవద్దన్న చంద్రబాబు

Update: 2017-07-10 12:10 GMT

టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో వైసీపీ ప్లీనరీ అంశo చర్చకు వచ్చింది. రాజకీయాల్లో కన్సల్టెంట్ ని నియమించు కున్నాడంటేనే జగన్ కు రాజకీయ అనుభవం లేదని జనాలకు అర్థమై పోయిందని చంద్రబాబు సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రశాంత్ కిశోర్ ను పక్కన పెట్టుకోవడం ద్వారా తనకు ఆత్మ విశ్వాసం లేదని జగన్ నిరూపించుకున్నాడని చంద్రబాబు చెప్పారు. గతంలో నరేంద్ర మోడీకి కన్సల్టెంట్ గా ప్రశాంత్ కిషోర్ పని చేసాడు కాబట్టి తనను కూడా మోడీ మాదిరిగా గెలిపించేస్తాడని గుడ్డి నమ్మకం తో జగన్ ఉన్నారని చంద్రబాబు అన్నారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ సలహాలు వెనుక నుంచి తీసుకోవచ్చు తప్పు లేదు..కానీ బహిరంగంగా ఇతనే నా కన్సల్టెంట్ అని సభలో ప్రజల ముందు ప్రకటించడం తప్పు అని చంద్రబాబు తెలిపారు. ఇకపై జగన్ గురించి మీరు ఎంత తక్కువ విమర్శిస్తే అంత మంచిదన్న చంద్రబాబు జగన్ గురించి పట్టించుకొనక్కర్లేదని ఎంపీలకు సూచించారు.

Similar News