ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ సీపీ నేత జగన్ కు ఈడీ మరోసారి ఝలక్ ఇచ్చింది. 117.74 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను జప్తు చేసింది. గృహనిర్మాణ ప్రాజెక్టుల చార్జ్‌షీట్‌లో ఆస్తులు , శ్యాంప్రసాద్‌రెడ్డి, ఇందు ప్రాజెక్ట్ ఆస్తులను ఎంబసీ ప్రాపర్టీ డెవలప్‌మెంట్, వసంత ప్రాజెక్ట్ ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేసినట్లు తెలిపారు. పాదయాత్రలో ఉన్న వైఎస్.జగన్ ఇది ఊహించని షాక్. గత కొద్ది కాలంగా కేసు పురోగతి లేదన్న వాదన వినిపిస్తోన్న తరుణాన ఈ మలుపు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. మోడీతో సాయిరెడ్డి భేటీ అయిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇప్పటికే పాదయాత్రపై కోర్టు కొన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రతి శుక్రవారం కోర్టు కు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది కూడా! వీటితో పాటు తాజాగా జరిగిన ఈ పరిణామంపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో మరి!