అంత దూరం ప్రయాణించి వచ్చినా వైసీపీ అధినేత జగన్ విచారణ జరగలేదు. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో కేసును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. ప్రతి శుక్రవారం జగన్ నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. అయితే అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉండటంతో ఆయన నిన్న మధ్యాహ్నం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ వచ్చేశారు. కాని న్యాయమూర్తి సెలవులో ఉన్న కారణంగా జగన్ కేసు వచ్చే శుక్రవారానికి వాయిదా పడింది. దీంతో జగన్ తిరిగి హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లాకు బయలుదేరి వెళ్లారు. పాదయాత్ర రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది.