రెండు రోజుల క్రితం పత్తికొండ ఎమ్మెల్యే టిక్కెట్ ను శ్రీదేవికి ఖరారు చేసిన జగన్ అదే ఊపుమీద ఎంపీ టిక్కెట్ కూడా ఖరారు చేశారు. అయితే అభ్యర్థిని నిర్ణయించలేదు కాని బీసీల్లో వెనుకబడిపోయిన బీసీ కులాల వారికి ఎంపీ టిక్కెట్ కేటాయించనున్నట్లు జగన్ వెల్లడించారు. జగన్ ప్రస్తుతం 19వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన బీసీ సంఘాల నేతలతో జగన్ మాట్లాడారు. బోయ కులానికి కర్నూలు లేదా అనంతపురం జిల్లాలో ఒక ఎంపీ స్థానాన్ని కేటాయిస్తానని జగన్ ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. వచ్చే రోజుల్లో తాను ప్రతి జిల్లాలో బీసీ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర తర్వాత బీసీ గర్జన ఉంటుందని, అందులో బీసీ డిక్లరేషన్ ను ప్రకటిస్తానని జగన్ వెల్లడించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 19వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం వెంకటగిరి నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభం కానుంది.
19వ రోజు పాదయాత్ర.....
జగన్ పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం 8గంటలకు వెంకటగిరి, కోడుమూరు కోట్ల సర్కిల్, కోడుమూరు కొత్త బస్టాండ్, వర్కూర్ ఎస్పీ కాలనీకి పాదయాత్ర చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.30గంటలకు జగన్ భోజన విరామానికి ఆగుతారు. అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభమై సాయంత్రానికి వేముగోడుకు చేరుకుంటుంది. రాత్రి 7గంటలకు వేముగోడు బహిరంగ సభ అనంతరం రాత్రికి జగన్ అక్కడే బస చేస్తారు. కర్నూలు జిల్లాలో పాదయాత్ర కొనసాగనుంది.