జగన్ ఎందుకిలా....అవసరమా?

Update: 2018-01-30 11:49 GMT

జగన్ ఎందుకిలా చేస్తున్నారు. వంగవీటి రాధా వివాదం సమసిపో్యిందనుకున్న తరుణంలో వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ కు గురైన విజయవాడ నేత పూనూరు గౌతంరెడ్డి జగన్ ను కలవడం చర్చనీయాంశమైంది. జగన్ పాదయాత్రలో గౌతంరెడ్డి జగన్ ను కలిసి ముచ్చటించారు. ఆయనతో కలిసి నడిచారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతతో జగన్ మాట్లాడటంతో ఇప్పుడు బెజవాడ రాజకీయాలు మరోసారి హీటెక్కనున్నాయి. గౌతంరెడ్డి అంటేనే రాధా మండిపోతున్నారు. తన తండ్రి హత్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో్ ఆయన పెద్దయెత్తున నిరసనను కూడా తెలిపారు. తర్వాత విజయసాయిరెడ్డి తదితర సీనియర్ నేతలతో గౌతంరెడ్డి టచ్ లో ఉన్నారని కూడా రాధా ఆరోపించారు. అయితే ఇదంతా కట్టుకధ అని వైసీపీ కొట్టిపారేసింది. రాధా పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే రాధాను బుజ్జగించి కొంతమేర సఫలం అయ్యారు. తాజాగా గౌతంరెడ్డి జగన్ ను కలిసినట్లు ఫొటోలు బయటకు రావడంతో రాధా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాపు నేతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గౌతంరెడ్డిని జగన్ దగ్గరకు తీయడం అవసరమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Similar News