జగన్ ఆ జిల్లాలో ఉండగానే... వైసీపీ నేత దారుణ హత్య

Update: 2017-12-06 06:25 GMT

అనంతపురం జిల్లాలో జగన్ పర్యటిస్తున్నారు. ఆయన ఆ జిల్లాలో పాదయాత్ర చేస్తుండగానే వైసీపీ నేత దారుణ హత్యకు గురికావడం సంచలనం కల్గిస్తోంది. అనంతపురం జిల్లాలో మరో సారి ఫ్యాక్షన్ గొడవలు చెలరేగాయి. అనంతపురం జిల్లాలోని వడంగపల్లిలో వైసీపీ నేత చెన్నారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా వేటకొడవళ్లతో నరికి చంపారు. ఇప్పుడు ఈ సంఘటన అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది రాజకీయ హత్యేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Similar News