చెప్పుతో కొట్టిందని రేప్ చేసి చంపిన కిరాతకులు

Update: 2017-10-14 02:27 GMT

ఒక ఫ్యాక్టరీ యజమానిని కిరాతకంగా చంపారు కార్మికులు. అందరి ముందు అవమానించడమే ఆమె చేసిన తప్పు. తమను చెప్పు తో కొట్టిన యజమానురాలి పై కక్ష పెంచుకున్నారు కార్మికులు . యజమాని లేని సమయంలో ఇంటికి వచ్చి యజమానురాలు ను రేప్ చేసి కిరాతకంగా చంపి వెళ్లిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే. మూసారాంబాగ్ లో ఉండే సమద్ కు పర్వీన్ బేగం తో వివాహం జరిగింది. ఇరవై ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరికి కూలర్స్ తయారుచేసే ఫ్యాక్టరీ చెంగిచెర్ల లో ఉంది. ఇందులో ఏడుగురు కార్మికులు పని చేస్తుంటారు. సమద్ లేని సమయంలో భార్య వెళ్లి అక్కడ కార్మికుల చేత పని చేయిస్తుంది. వారం రోజుల క్రితం సమద్ దిల్లీ కి వెళ్ళిపోయాడు. భార్య పర్వీన్ బేగం ఫ్యాక్టరీ కి వెళ్లి కార్మికుల చేత పని చేస్తుంది. ఈ సమయంలో పైన ఉన్నవాటర్ ట్యాంక్ లోకి నీళ్లు ఎక్కిస్తున్నారు కార్మికులు. వాటర్ ట్యాంక్ నిండి పోయి నీళ్లు మొత్తం కిందకి పడి పోతున్నాయి. ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్పుతో కొట్టింది. అందరి ముందు చెప్పుతో కొట్టడంతో ఆమె పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా సరే ఓనర్ పై కక్ష్య తీర్చుకోవాలనుకున్నాడు. అదను కోసం చూస్తున్నఈ సమయంలో డబ్బులో కోసమని యజమాని ఇంటికిఫోన్ చేసాడు అమెచన్. సమద్ ఇంట్లో లేడని గోవాకు వెళ్లాడని వారం తరువాత తిరిగి వస్తారనిచ అప్పుడే డబ్బులు చెల్లిస్తామని పర్వీన్ బేగం కార్మికుడు అమెచన్ కు చెప్పింది. పర్వీన్ పై పగ తీర్చుకోవడానికి ఇదే తగిన సమయం అని చెప్పి అనుకున్నాడు. దీంతో ఇద్దరు మైనర్ కార్మికులను తీసుకొని చెంగిచెర్ల నుంచి మూసారాంబాగ్ కు ఆటోలో వచ్చాడు. పర్వీన్ బేగం డోర్ తీయగానే ఒక మైనర్ ఆమె మెడపై కత్తి పెట్టాడు.

సెల్ ఫోన్ ఆధారంగా.....

అమెచన్ తో పాటు మరొక ఇద్దరూ అత్యాచారానికి తెగ బడ్డారు. తరువాత గొంతుకోసి చంపి ఆమె బంగారు ఆభరణాలు నగదును డబ్బును ఎత్తుకొని పారిపోయారు.. పర్వీన్ దేహాన్ని ఇంటిలోనే పెట్టి తాళం వేసి వచ్చారు. ఎప్పట్లాగానే ఫ్యాక్టరీకి వెళ్లి తిరిగి పని చేయడం ఆరంభించారు. ఒక ఒక మైనర్ ను మాత్రం సెల్ ఫోన్ ఇచ్చి అస్సాం పంపించారు. మూడు రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి చూడగా మృతదేహం కనబడింది దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి విచారణ ఆరంభించారు. పర్వీన్ బేగంను చంపినట్లుగా పోలీసులు తేల్చారు. మిస్సయిన సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. మర్డర్ జరిగిన తర్వాత అదృశ్యమైన కార్మికుడి గురించి ఆరా తీయగా హత్య విషయం బయటపడింది. దీంతో పోలీసులు అమెచన్ ను అదుపులో తీసుకుని ప్రశ్నించగా హత్య, అత్యాచారం చేసిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు.. దీంతో ఇద్దరు మైనర్ లతోపాటు అమెచన్ ను పోలీసులుఅరెస్టు చేశారు.

Similar News