డిప్యూటీ సీఎం చినరాజప్పకు అవమానం జరిగింది. అమరావతిలో జరిగిన ఫోరెన్సిక్ ల్యాబ్ శంకుస్థాపన కార్యక్రమానికి హోంమంత్రి చినరాజప్ప డుమ్మా కొట్టారు. ఆయనకు ఒక కానిస్టేబుల్ చేత ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. తాను విజయవాడలో ఉన్నా... తన శాఖకు సంబంధించిన కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానాన్ని కానిస్టేబుల్ తో పంపుతారా? అని ఆయన ఆగ్రహం చెంది ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. చినరాజప్ప రాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరాతీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల తీరును తప్పుపట్టినట్లు తెలిసింది. ఇక మీదట ఇలా జరిగితే ఊరుకోబోనని హెచ్చరించినట్లు సమాచారం.