చంద్రయ్యా....ఇదేమిటయ్యా?

Update: 2018-03-19 11:19 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు నిద్రపట్టనివ్వడం లేదు. జాతీయ మీడియా కూడా పవన్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుని రోజూ ఏదో ఒక జాతీయ మీడియా పవన్ ఇంటర్వ్యూలను చేస్తోంది. తాజాగా న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సయితం పవన్ కల్యాణ్ చంద్రబాబు సర్కార్ పై ధ్వజమెత్తారు. ఈసారి కేవలం లోకేష్ మాత్రమే కాకుండా మరో 40 మంది ఎమ్మెల్యేలను కూడా పవన్ టార్గెట్ చేశారు. చంద్రబాబు పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలతో పాటు లోకేష్ కూడా అవినీతికి పెద్దయెత్తున పాల్పడుతున్నట్లు పవన్ ఆరోపించారు. తాను ఎన్నిసార్లు చంద్రబాబుకు ఈ విషయాన్ని చెప్పినా పట్టించుకోలేదన్నారు పవన్. ఆ మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ చంద్రబాబుకు 2.5 మార్కులే వేస్తానని చెప్పడం విశేషం. తాను ఉన్నట్లుండి ఈ ఆరోపణలు చేశాననడం సరికాదని, నాలుగేళ్లుగా ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకు వస్తూనే ఉన్నానన్నారు. పోలవరం ప్రాజెక్టులోనూ పెద్దయెత్తున అవినీతి జరుగుతుందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. మొత్తం మీద పవన్ మాత్రం చంద్రబాబు అవినీతిని రోజూ ఏదో ఒక రూపంలో ఎండగడుతూనే ఉన్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Similar News