చంద్రబాబునే తప్పపట్టిన రాయపాటి..?

Update: 2017-10-31 09:30 GMT

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్ర బాబు అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్న చందంగా పరిస్థితి ఎదురవుతుంది . కేంద్రం పోలవరం నిర్మాణం చూసి చూడనట్లు పోతుందని భావించారు. చంద్రబాబు. అనూహ్యంగా ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్టర్ ట్రాన్స్ స్ట్రాయి ఢిల్లీ లో చక్రం తిప్పడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తప్పు పట్టింది. దాంతో దడపుట్టిన చంద్రభాను విదేశీ పర్యటనకు వెళ్లేముందు నాగపూర్ హుటాహుటిన వెళ్ళి నితిన్ గడ్కరి ని కలుసుకుని నాలుగు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. ఆయన మాటలకు తల ఊపిన గడ్కరీ ఢిల్లీ లో సమావేశం నిర్వహించారు. ఇక ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు రాష్ట్ర్ర ప్రభుత్వాన్నే తప్పుపట్టారు.

అక్కడా చుక్కెదురే........

ఢిల్లీ సమావేశం లో కూడా కేంద్రమంత్రి చంద్రబాబు సూచనలను కానీ సలహాలను ఏవి పట్టించుకోకుండా కాంట్రాక్టర్ ను మార్చకుండా పని వేగంగా పూర్తి చేయాలన్నారు. ఒకవేళ కాంట్రాక్టర్ ను మారిస్తే 14 శాతం తక్కువకు ట్రాన్స్ స్ట్రాయి చేసిన విధంగానే చేయాలని కోరింది. పాత అంచనాల ప్రకారమే నిధులు మంజూరు చేస్తామని తేల్చి చెప్పేశారు. ఇది బాబు సర్కారును మరింత అప్పుల ఉబికి తెచ్చేలాగే కనపడుతుంది. కేంద్రం ఏమి చెప్పినా 60 సి ప్రకారం ముందుకు వెళ్ళీ కొన్ని పనులు వేరే సంస్థలకే అప్పగించాలని బాబు డిసైడ్ అయిపోయారు.

మేమేం చేస్తాం అంటున్న రాయపాటి ...

మాకు భూమి సేకరించి ఇవ్వడానికి మూడేళ్లు పట్టింది. ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో బాబు వున్నారని ఎంపి రాయపాటి సాంబశివరావు ప్రకటించారు . ఇక నిధుల కొరత అంతా ఇంతా కాదని వాపోతూ ఆ సొమ్మేదో తమకిస్తే కట్టిస్తామని చెబుతున్నారు రాయపాటి . పోలవరం పై కొత్తవారికి పనివేగం కోసం కొన్ని పనులు ఇవ్వాలని బాబు భావిస్తున్నారని 2019 లోపు పూర్తి చేయాలన్న ఆయన ఆశయం మంచిదే అని అంటున్నారు.

కిం కర్తవ్యం ...?

పోలవరం ప్రాజెక్ట్ వేగవంతంగా పూర్తి చేయాలంటే ఏమి చేయాలనే అంశంపై చంద్రబాబు నవంబర్ ఒకటో తేదీన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేంద్రం సహకారం అందివ్వని స్థితిలో పనులు స్పీడ్ పెరగాలంటే ఏమి చేయాలనే ఆలోచన చేస్తున్నారు. పాత లెక్కల ప్రకారం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు కొత్త కాంట్రాక్టర్ లను ఎవరిని నియమించినా వారికీ అదనంగా ఇచ్చే నిధులు రాష్ట్ర ఖజానా నుంచే భరించాలి. అప్పులు తెచ్చిన వాటికే వడ్డీలు సైతం చెల్లించలేక ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ఈ నేపథ్యంలో క్లియర్ రూట్ మ్యాప్ కి బాబు స్కెచ్ గీస్తున్నారు . ఆ స్కెచ్ ఎపి కి పోలవరం అప్పుల వరంగా మారుస్తారా లేక నిజమైన వరంగా చూపిస్తారో వేచి చూడాలి

Similar News