చంద్రబాబును కలవరపరుస్తున్న సర్వే...!

Update: 2018-01-19 02:30 GMT

రిపబ్లిక్ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే టిడిపి లో ఇప్పుడు కలవరానికి గురయ్యేలా చేసింది. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తే ఏపీలో వైసిపికి 13 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయని సర్వే పేర్కొంది. 2014 ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్న వైసిపి 5 స్థానాలు మెరుగుపర్చుకోవడంతో బాటు ఓట్ల శాతాన్ని సైతం గణనీయంగా పెంచుకుందని ఆ సర్వే తేల్చింది. 2014 లో టిడిపి బిజెపి కూటమికి దక్కిన 17 పార్లమెంట్ స్థానాలు 12 కు పరిమితం అవుతున్నట్లు వచ్చిన లెక్కలు పసుపు పార్టీలో ఆందోళన పెంచింది. సర్వే అంశం టిడిపి పైకి సీరియస్ గా తీసుకోవడం లేదని చెబుతున్నా పార్టీ మైనస్ లపై చర్చ మొదలైంది.

తెలంగాణ లో టీఆర్ఎస్ ....

తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని సర్వే వెల్లడించింది. టీఆర్ఎస్ 12 పార్లమెంట్ స్థానాలు సాధిస్తుందని, బిజెపి 3, కాంగ్రెస్ కి 2 పార్లమెంట్ స్థానాలే దక్కుతాయని పేర్కొంది. దేశంలో బిజెపి తిరిగి అధికారం దక్కించుకుంటుందని మోడీ ప్రభుత్వం తిరిగి గద్దెనెక్కుతుందని రిపబ్లిక్ తేల్చింది. ఇది తెలంగాణాలో గులాబీ దళంలో జోష్ పెంచితే కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సహాన్ని నింపింది. ఏడాది ముందు జరిపిన ఈ సర్వే బిజెపి అనుకూల మీడియా చేసింది కాబట్టి పట్టించుకోనవసరం లేదని కొట్టిపాడేసింది.

Similar News