చంద్రబాబుకి బ్రాహ్మణ దండు రెడీనా?

Update: 2017-10-07 08:30 GMT

ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మెన్ వేమూరి ఆనంద్ సూర్య వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు కు అండగా ఉండేలా బ్రాహ్మణ దండును తయారు చేస్తున్నారు . ఏబీసీ కార్పొరేషన్ కు దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలకు సెలెక్ట్ అయిన వారిని సీఎం చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు అందిస్తున్నారో చూశారు . ఇక మీరు చేయాలిసింది ఆయనకు కృతజ్ఞతగా మీ బంధు మిత్రుల ద్వారా చంద్రబాబు కు కృతజ్ఞతలు చూపడమే అంటూ అందరికి ట్రైనింగ్ ఇస్తున్నారు. బ్రాహ్మణులకు ఏ చిన్న సాయం చేసినా ప్రత్యుపకారం చేయడం అలవాటు కనుక బాబు సర్కార్ తిరిగి వచ్చేలా ఇప్పటి నుంచి పనిచేయాలంటూ అందరికి లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు.

ఐవైఆర్ పై ...

ఇచ్చిన గౌరవానికి ఏమాత్రం కృతజ్ఞత లేకుండా మాజీ చీఫ్ సెక్రెటరీ ఐవైఆర్ కృష్ణా రావు వ్యవహరించి అందరికి చెడ్డపేరు తెచ్చారంటూ ఆయనపై నిప్పులు చెరిగారు ఏబీసీ కార్పొరేషన్ ఛైర్మెన్ ఆనంద్ సూర్య . అమరావతిలో ఏబీసీ నూతన ఎండీగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్ డాక్టర్ ఎం పద్మ కు స్వాగత కార్యక్రమంలో ఆనంద్ చెలరేగిపోయారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఎత్తేస్తున్నారని కొందరు పనిగట్టుకుని పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారని అవన్నీ అసత్యాలని వెల్లడించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ను తిరిగి గెలిపించుకోకపోతే హిందూ ధర్మం ఉండదని భగవద్గీత బదులు బైబిల్ చేతిలో ఉంటుందని హెచ్చరించారు. మొత్తానికి ఆనంద్ సూర్య పార్టీ పరంగా తనకు చంద్రబాబు అప్పగించిన భాధ్యతను తనదైన శైలీలో కొనసాగిస్తూ దూసుకుపోతున్నారు.

Similar News