చంద్రబాబు సీరియస్: త్రిసభ్య కమిటీ ఏర్పాటు

Update: 2018-01-13 08:50 GMT

జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మంత్రి మాణిక్యాలరావు వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు త్రిసభ్య కమిటీని నియమించారు. ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో మంత్రి మాణిక్యాలరావు, ఏలూరు జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరూ బహిరంగ విమర్శలకూ దిగారు. అయితే ఈ వివాదంపై తనకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు త్రిసభ్య కమిటీని కోరారు. త్రిసభ్య కమిటీలో మంత్రులు పుల్లారావు, కొల్లు రవీంద్రతో పాటు ఎమ్మెల్యే వర్మను నియమించారు. బాపిరాజుపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలిసింది. ప్రధాని మోడీతో భేటీ అయిన తర్వాత చంద్రబాబు టీడీపీ, బీజేపీ నేతల మధ్య గ్యాప్ ను తగ్గించే ప్రయత్నం చేసేందుకే ఈ త్రిసభ్య కమిటీని నియమించినట్లు చెబుతున్నారు.

Similar News