చంద్రబాబు బూటు కి అంత పవర్ ఉందా ..?

Update: 2017-11-15 03:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను వైసిపి ఫైర్ బ్రాండ్ రోజా వదిలి పెట్టేలా లేరు. చంద్రబాబు ఎక్కడ పూజలు చేసినా కాళ్ళకు బూట్లు వేసుకుని చేస్తారంటూ రోజా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కరాల్లో ఇలాగే బూట్లు వేసుకుని పూజలు చేసి గోదావరి లో మునిగి 29 మంది ప్రాణాలను చంద్రబాబే గాల్లో కలిపారన్నారు రోజా. అలాగే కృష్ణా పవిత్ర సంగమంలో కూడా బూట్లు వేసుకుని పూజలు చేసి 22 మంది ప్రాణాలను కృష్ణ లో బాబు కలిపారని విమర్శించారు. అసలు బాబు పూజలు చేయకపోయినా ఫర్లేదని చెప్పుకొచ్చారు. బూట్లు వేసుకుని పూజలు చేయడం కన్నా మానేయడం మంచిదంటూ సలహా కూడా ఇచ్చారు.

రోజా పగతీర్చుకుంటున్నారా ?

ఏ చిన్న అవకాశం బాబుపై దొరికినా రోజా విడిచిపెట్టరు. అందుకు అనేక కారణాలే వున్నాయి. రోజా టిడిపిలో చేరాకా తమ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయ్యిందని. వైఎస్ తో ఆమె భేటీ అయ్యాకా ఆయనే లేకుండా పోయారని , వైసిపిలోకి వెళ్ళాకా ఆ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం అయ్యిందంటూ రోజాను ఐరన్ లెగ్ గా ప్రతీసారి టిడిపి మంత్రులు, నేతలు విమర్శలు గుప్పిస్తూ వుంటారు. దాంతో ఎప్పుడు బాబు అండ్ టీం పై ఒక రేంజ్ లో ఫైర్ కావడం వైసిపిలో చేరిన నాటినుంచి రోజా మొదలు పెట్టింది. రోజా తాజా కామెంట్స్ పై ఇప్పుడు టిడిపి రియాక్షన్ ఎలా వుండబోతుందా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

Similar News