గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ దెబ్బతో బీజేపీకి చాలా షాకులు తగిలాయి. మరోసారి బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావడం ఖాయమైనా కాంగ్రెస్ దెబ్బతో గుజరాత్ బీజేపీ శ్రేణులతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ట్రెండ్స్ మారే వరకు టెన్షన్ పడ్డారు. ఒకానొక దశలో బీజేపీ 80 సీట్లకే పరిమితమైతే కాంగ్రెస్ 95 సీట్ల వరకు లీడింగ్‌లోకి వెళ్లింది. ఇక గుజరాత్‌లో బీజేపీకి తగిలిన షాకులు ఇలా ఉన్నాయి.
- సౌరాష్ట్ర కచ్ ప్రాంతంలో కాంగ్రెస్ దూకుడుకు బీజేపీ బేజారైంది. పటేళ్ల ఉద్యమం, రైతుల అసంతృప్తితో సౌరాష్ట్ర, కచ్ ప్రాంతంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ కాంగ్రెస్ 31 సీట్లతో సత్తా చాటగా, బీజేపీ 22 సీట్లతో సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది.
- గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాలతో పాటు పల్లె ప్రాంతాల్లో కాంగ్రెస్ బీజేపీ కంటే స్పష్టమైన ఆధిక్యం కనపరిచింది.
- పటేదార్ ఉద్యమ ప్రభావంతో పటేల్ వర్గం ఓటర్లు ఉన్న చోట్ల కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. 39 నియోజకవర్గాల్లో ఈ ఎఫెక్ట్ గట్టిగా పడింది.
- ఇక గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజ్‌కోట్ వెస్ట్ నియోజకవర్గంలో ఓటమి అంచుల వరకు వెళ్లి తక్కువ మెజార్టీతో బయటపడ్డారు.
- ఆరు జిల్లాల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. ఆమ్రేలీ, నర్మద, పోరు బందర్, ఆనంద్, డాంగ్స్, తాపీ జిల్లాల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు