గుజరాత్ ఎన్నికలు మరింత వేడెక్కాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపించింది. అహ్మద్ పటేల్ ట్రస్టీగా వ్వవహరించిన ఆసుపత్రిలో పనిచేసిన వ్యక్తిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేయడాన్ని బీజేపీ ప్రశ్నిస్తుంది. అహ్మద్ పటేల్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. బీజేపీ కేవలం ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే అనవసర ఆరోపణలకు దిగుతుందని చెబుతోంది. ఆఆసుపత్రికి అహ్మద్ పటేల్ కుటుంబసభ్యులకు ఎటువంటి సంబంధం లేదని కొట్టిపారేసింది.
అహ్మద్ పటేల్ కు ఉగ్రవాదులతో.....
రెండు రోజుల క్రితం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిగా అనుమానించి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ ఇద్దరిని అదుపులోకి తీసింది. ఇందులో ఒక వ్యక్తి పేరు ఖాసిం స్టింబర్ వాలా. ఈవ్యక్తి అహ్మద్ పటేల్ ట్రస్టీగా ఉన్న సర్దార్ పటేల్ ఆసుపత్రిలోని సాంకేతిక విభాగంలో పనిచేస్తున్నారు. ఉగ్రవాదులను అరెస్ట్ చేయకుంటే గుజరాత్ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదోనన్న అనుమానాన్ని బీజేపీ వ్యక్తం చేసింది. టెర్రరిస్టులు గుజరాత్ ఎన్నికలను టార్గెట్ చేసుకున్నారన్న సమాచారంతో ఈ విమర్ళలను బీజేపీ మరింత విస్తృతం చేసింది. గుజరాత్ ను కైవసం చేసుకోవడానికి రెండు పార్టీలు అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.