గుజరాత్ లో రాహుల్ కొత్త ఎత్తుగడ...!

Update: 2017-12-03 17:30 GMT

గుజరాత్ ఎన్నికల్లో బిజెపిని కాంగ్రెస్ యువసారధి రాహుల్ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ని టార్గెట్ చేస్తూ రోజుకో ప్రశ్న సంధిస్తూ వాటికి సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. తాజాగా రాహుల్ సంధించిన ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది. గుజరాత్ అభివృద్ధిలో దూసుకుపోతుందని ప్రధాని మోడీ చెబుతూ వుంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వ విద్య కోసం చేస్తున్న ఖర్చు పరిగణలోనికి తీసుకుంటే దేశంలో 26 వస్థానంలో ఎందుకు ఉందని సూటిగా ప్రశ్న వేశారు యువనేత. గుజరాత్ వాసులకు విద్యను అందని ద్రాక్ష చేసేందుకు ప్రైవేట్ రంగంలో విద్యను ప్రోత్సహించి యువతకు అన్యాయం ఎందుకు చేశారని నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ.

మూడు లక్షల మంది సైన్యంతో ...

ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సారధ్యంలో గుజరాత్ ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్ పటిష్ట ప్రణాళికను సిద్ధం చేసింది. దాదాపు మూడు లక్షలమంది బూత్ కమిటీ సభ్యులను ఏర్పాటు చేసుకుని కదనరంగంలోకి దూసుకు వెళుతుంది. యుపి స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ కి చేదు అనుభవం మిగిల్చినా గుజరాత్ ఎన్నికల్లో ఏ మాత్రం జోరు తగ్గించడం లేదు. కాంగ్రెస్ తాజా ఎత్తుగడలను బిజెపి ఇంటిలిజెన్స్ నిశీతంగా పరిశీలిస్తుంది. తమ ప్రత్యర్థి వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని నడిపేందుకు కమలనాధులు కసరత్తులు మొదలు పెట్టేశారు.

Similar News