రాష్ట్రపతులు, గవర్నర్ లు చేసే ప్రసంగాలు ఆయా ప్రభుత్వాలు ఇచ్చే నివేదికల వంటివి . అవి ఏ మాత్రం రుచించవు. చెప్పగానే అందరికి అనిపిస్తాయి. కానీ ఈసారి మాత్రం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇవ్వనున్న బడ్జెట్ ప్రసంగం హాట్ టాపిక్ నే అయ్యింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తోలి రోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై అందరి దృష్టి నిలిచింది. అసెంబ్లీలో గవర్నర్, పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగాలు ఆయా ప్రభుత్వాల పనితీరు, లక్ష్యాలు, ఆశయాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రస్తావనే సహజంగా ఉంటుంది. నిన్న మొన్నటి వరకు కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి సర్కార్ ల నడుమ సఖ్యత నడిచిన సమయంలో గవర్నర్ నరసింహన్ కి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. కానీ ఇప్పడు వీరిద్దరి నడుమ పొత్తు అంతిమ దశకు చేరుకుంది. దాంతో గవర్నర్ ప్రసంగం కత్తిమీద సాములా మారింది.
ఇప్పటికే పలు మార్పులు సూచించిన నరసింహన్ ...
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సిద్ధం అయినప్పటికీ అది ఆయన కు ఇబ్బంది గా మారడంతో పలు మార్పులు సూచించినట్లు తెలియవస్తుంది. ఇప్పటికే రెండు మూడు సార్లు మార్పులు చేర్పులను గవర్నర్ సూచించడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ ప్రసంగాన్ని రూపొందించే ప్రభుత్వ యంత్రాంగంలోని అధికారులకు ఈ వ్యవహారం తలనొప్పి తెప్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ప్రస్తావించాల్సిన అంశాలని చెప్పినవాటిల్లో గవర్నర్ తొలగించాలనడం, తీసేస్తే సర్కార్ తో తిప్పలు, తీయకపోతే నరసింహన్ తో చీవాట్లు అన్నట్లు ఉందని అంటున్నారు. మొత్తానికి విచిత్ర రాజకీయ పరిస్థితుల్లో శాసనసభ వేదికగా గవర్నర్ చేసే ప్రసంగం చాలా కాలం తరువాత ఆసక్తికరంగా ఉండటం విశేషం.