గజల్ శ్రీనివాస్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన గజల్ ను చంచల్ గూడ పోలీసులకు తరలించారు. గజల్ కు బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ ను కోర్టు రేపు విచారించనుంది. గజల్ శ్రీనివాస్ తనను లైంగికంగా వేధించారని కుమారి అనే యువతి ఇచ్చిన ఆధారాలు కీలకంగా మారాయి. గజల్ శ్రీనివాస్ తనతో మసాజ్ చేయించుకునేవాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు లీకయ్యాయి.
పక్కా ఆధారాలు....
కుమారి అనే యువతి ఆరు నెలల క్రితమే గజల్ శ్రీనివాస్ కు చెందిన వెబ్ రేడియోలో చేరారు. అయితే ఆమెను గత కొంతకాలంగా గజల్ శ్రీనివాస్ వేధిస్తున్నట్లు యువతి ఆరోపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన పోలీసులు ప్రాధమికంగా గజల్ లైంగిక దాడి చేసినట్లు భావిస్తున్నారు. బయటకు విషయాలు చెబితే భవిష్యత్ లేకుండా చేస్తానని కూడా గజల్ హెచ్చరించినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది.
అమాయకుడినంటున్న.....
అయితే గజల్ శ్రీనివాస్ మాత్రం తాను అమాయకుడని చెబుతున్నారు. ఆ యువతిని తన బిడ్డగా భావిస్తున్నానన్నారు. తనకు కొద్దికాలం క్రితం యాక్సిడెంట్ అయిందని, ఆ యాక్సిడెంట్ కారణంగా ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉందన్నారు. అయితే ఆరోజు ఫిజియో థెరపిస్ట్ రాకపోవడంతో ఈ యువతి తనకు ఫిజియో థెరపీ తెలుసనని, తాను మసాజ్ చేస్తానని ముందుకు వచ్చిందన్నారు గజల్. తనకు మహిళలంటే అపారమైన గౌరవమన్న గజల్ ఇదంతాకుట్ర ప్రకారమే జరిగిందని చెప్పడం విశేషం.