కోమటిరెడ్డి అనుచరుడు దారుణ హత్య....!

Update: 2018-01-25 03:46 GMT

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి వచ్చి బండరాళ్లతో మోది చంపారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్య లక్ష్మి మున్సిపల్ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. దీంతో నల్లగొండలో టెన్షన్ నెలకొంది. రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఉన్న శ్రీనివాస్ కు ఫోన్ వచ్చింది. తమతో ఎవరో గొడవ పడుతున్నారని స్థానిక కౌన్సిలర్ గోపి ఫోన్ చేసి శ్రీనివాస్ కు చెప్పారు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్ ను గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోది చంపారు. హత్య చేసిన అనంతరం నేరుగా నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. కాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాస్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. శ్రీనివాస్ హత్య ఒక పథకం ప్రకారమే జరిగిందన్నారు. మున్సిపల్ ఛైర్మన్ కు సెక్యూరిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదన్నారు కోమటిరెడ్డి.

Similar News