కొత్త ఏడాది పవన్ ప్లాన్ ఇదే....!

Update: 2018-01-01 04:30 GMT

జనసేన సభ్యత్వ కార్యక్రమం ప్రారంభమైంది. కొత్త ఏడాదికి ఒక్క రోజు ముందు జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ప్రకటించారు. ఆయన తన తొలిసభ్యత్వాన్ని తీసుకున్నారు. త్వరలోనే ఆన్ లైన్ జనసేన పార్టీలో చేరాలనుకునే వారు సభ్యత్వాన్ని తీసుకునే వీలుంది. పార్టీలో సభ్యులుగా చేరేందుకు లక్షలాది మంది ఉవ్విళ్లూరుతున్నారని, విపరీతమైన స్పందన వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

జనంలోనే ఉండేలా....

కొత్త ఏడాది జనసేనాని ఇక జనంలోనే ఉంటారు. ఇప్పటికే గత మూడు రోజులుగా పవన్ కల్యాణ‌ గత కొన్నేళ్లుగా తనను అనుసరించే వారితో సమావేశమయ్యారు. ఈ మూడురోజుల భేటీలో వారితో పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి చర్చించారు. పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను వారికి వివరించారు. దీంతో పాటుగా ప్రజల సమస్యలను తెలుసుకుని అజెండాను రూపొందించాలని వారిని కోరారు.

హైదరాబాద్ లో శిక్షణ....

ఇప్పటికే పార్టీ ఎంపిక చేసిన కంటెంట్ రైటర్లు, విశ్లేషకులు, సమన్వయ కర్తలకు త్వరలోనే హైదరాబాద్ లో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయానున్నారు. శిక్షణ శిబిరాలు ఎలా ఉండాలి? ఎన్ని రోజులు ఉండాలి? వారికి ఏ ఏ అంశాలపై వివరించాలో పవన్ పార్టీ ముఖ్యులకు వివరించారు. ముందుగా మహిళలు, సీనియర్ సిటిజన్లతో కొత్త ఏడాది హైదరాబాద్ లో సదస్సు నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. మొత్తం మీద కొత్త ఏడాది జనసేనాని ఇక జనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

Similar News