కేసీఆర్, స్టాలిన్ వ్యూహం అదేనా ...?

Update: 2017-11-28 06:30 GMT

కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాల హక్కులు సాధించాలని ప్రాంతీయ పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయా ? అవుననే చెబుతున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మధ్య నడుస్తున్న సహకారం కొత్త రాజకీయ ఎత్తుగడలను చెప్పకనే చెబుతుంది. అసలు వీరిద్దరి కలయికపైనే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. టి సీఎం కేసీఆర్ ఢిల్లీ లో రిజర్వేషన్ల నిర్ణయం రాష్ట్రాల హక్కులుగా ఉండాలన్న డిమాండ్ పై డీఎంకే టిఆర్ స్ కి మద్దతు ప్రకటించింది.

ముందు నుంచి డీఎంకే పోరాట వైఖరే ...

1967 లోనే విద్యా ఉద్యోగాల్లో ఎంబీసీ కోటా 69 శాతం తమిళనాడులో అమలు కావడం వెనుక డీఎంకే కృషి ఎంతో వుంది. తమవల్లే రిజర్వేషన్లు సాధించామని ఇప్పటికి తమిళనాడులో డీఎంకే చెప్పుకుంటుంది కూడా. ఈ నేపథ్యంలో తొలి నుంచి దీనిపై పోరాడుతున్న పార్టీగా కొనసాగాలని భావించడం అలాగే దక్షిణాదిపై పెత్తనాన్ని వ్యతిరేకించాలన్న ఆలోచన కేసీఆర్, స్టాలిన్ లను కలిపిందని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలే కరుణానిధి ని ప్రధాని స్వయంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని ఢిల్లీ లో తన ఇంట్లో విశ్రాంతి కి ఆఫర్ ఇచ్చి భవిష్యత్తు రాజకీయాలకు స్నేహ హస్తం అందించారు. కానీ కేంద్రంలో ఏ ప్రభుత్వం వున్నా పోరాట వైఖరి అవలంభించడం ప్రజల్లో పాపులారిటీ తెస్తుందని అంచనా వేసిన స్టాలిన్ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్ట పడటం లేదట. ఇప్పుడు కేసీఆర్ స్టాలిన్ కలయిక సైతం రాబోయే రోజుల్లో కొత్త రాజకీయపునరేకీకరణకు దారి తీయవచ్చని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Similar News