తెలంగాణ సీఎం కేసీఆర్ - జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చిన్నపాటి సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు. పవన్, కేసీఆర్ ఉప్పునిప్పుగా ఉంటారు... ఇటీవల కేసీఆర్ పవన్‌పై అదిరిపోయే రేంజ్‌లో సెటైర్లు వేశారు. మరి వీరిద్దరు ఎక్కడ కలుసుకున్నారు..ఆ సీక్రెట్ మీటింగ్ ఏంటన్న సందేహం రాకమానదు. అసలు మ్యాటర్‌లోకి వెళితే శీతాకాల విడిదిలో భాగంగా నాలుగురోజుల భాగ్యనగర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఆదివారం సాయంత్రం విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబుతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా హాజరయ్యారు.
గవర్నర్ విందులో....
ఈ విందుకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సైతం వచ్చారు. ఈ విందులో పలువురు ప్రముఖులు ఒకరికొకరు తమ విమర్శలు, రాజకీయాలు పక్కన పెట్టి ఆహ్లాదకరంగా ఒకరినొకరు పలకరించుకుని, కులాసా కబుర్లు చెప్పుకున్నారు. ఈ విందులో సీఎం కేసీఆర్, జనసేన అధినేత కేసీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. వీరు పలకరించుకోవడంతో పాటు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో తెలియదు కాని... నవ్వుకున్నారు కూడా...ఈ ఫొటోలు భయటకు రావడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కేసీఆర్ - పవన్ ఏం మాట్లాడుకున్నారా ? అని చర్చలు నడుస్తున్నాయి.
ఇద్దరూ భిన్న ధృవాలే...
పవన్ - కేసీఆర్‌లు ఇద్దరూ భిన్న ధృవాలకు చెందిన వారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతూ వస్తున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్ పవన్‌ను తాను అస్సలు పట్టించుకోననే చెప్పారు. ఇక ఈ యేడాది ఏపీలో జరిగిన నంద్యాల ఉప ఎన్నిక టైంలో ఏపీలో ఎన్నికలు జరిగితే కేసీఆర్ పవన్ జనసేనకు 1 శాతం ఓట్లు కూడా రావని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ పలు వ్యాఖ్యలపై పవన్ నేరుగానో, లేదా సోషల్ మీడియా ద్వారానో కౌంటర్లు ఇస్తూనే ఉంటున్నారు.
రాజకీయ అంశాలపైనేనా?
ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి వాతావరణం అయితే లేదు. అయితే గవర్నర్ విందు సాక్షిగా ఇద్దరూ తారసపడడం, ముచ్చటించుకోవడంతో వీరి మధ్య పర్సనల్ విషయాలే చర్చకు వచ్చాయా ? లేదా రాజకీయ అంశాలు చర్చించుకున్నారా ? అన్నది మాత్రం తెలియడం లేదు. వీరిద్దరి ముచ్చట చూసి అక్కడున్న వారితో పాటు కొందరు రాజకీయ నాయకులు సైతం షాక్ అయ్యారు. రాజకీయాల్లో శాశ్వత శత్రులు, మిత్రులు ఉండరు అన్న నానుడిని మరోసారి కేసీఆర్ - పవన్ నిజం చేశారు కదూ..!