జనంలోకి సోమవారం నుంచి వెళదామని అనుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ టూర్ కి బ్రేక్ పడింది . భారీ వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పర్యటనను ఆయన వాయిదా వేసుకోవాలిసి వచ్చింది . ఈ టూర్ తిరిగి ఈనెల 12 నుంచి ప్రారంభం కానుంది. కేసీఆర్ పర్యటన కోసం భారీ ఎత్తున చేసిన ఏర్పాట్లు వర్షార్పణం అయిపోయాయి. మరో మూడు రోజుల్లో ఆయన టూర్ విజయవంతానికి మంత్రి హరీష్ రావు స్వయంగా దగ్గరుండి పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
సింగరేణి కార్మికులపై మరిన్ని వరాలు ...
ఇది లా ఉండగా సింగరేణి కార్మికులకు కేసీఆర్ నజరానాలపై నజరానాలు ప్రకటించేశారు. కార్మికులకు పదిలక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు, రూపాయికే కార్మిక సంఘాల్లో సభ్యత్వాలు , గృహ నిర్మాణాలు ఇలా వాళ్ళు అడిగినవి అడగనివి కూడా ఎడా పెడా ఇస్తామని చెప్పేశారు . మరో పదిహేను 20 రోజుల్లో వారి వద్దకు వచ్చి బాగోగులు స్వయంగా చూసుకుంటానని హామీ ఇచ్చారు . కార్మికుల పిల్లల విద్య , కుటుంబానికి వైద్యం వంటివి దగ్గరుండి చూసి సెట్ చేస్తా అని ప్రకటించారు . మొత్తానికి సింగరేణి విజయం కేసీఆర్ లో ఎక్కడా లేని జోష్ పెంచింది .