కేసీఆర్ ఆయనకే ఓటేశారు...!

Update: 2017-11-10 06:30 GMT

తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి పేరు దాదాపు గా ఖరారయినట్లే. తెలంగాణకు నూతన డీజీపీ మహేందర్ రెడ్డినే నియమించాని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుత డీజీపీ అనురాగశర్మ పదవీకాలం ఈ నెల 12వ తేదీతో ముగుస్తుంది. ఆయన తర్వాత ఎవరు? అన్న ప్రశ్న ఇప్పటి వరకూ ఐపీఎస్ లలో విన్పించింది. డీజీపీ రేసులో మొత్తం ఏడుగురు ఐపీఎస్ అధికారులున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన తీసుకుంటే కృష్ణప్రసాద్, రాజీవ్ త్రివేదీలలో ఒకరికి అవకాశం ఉంటుందని భావించారు. కాని ముఖ్యమంత్రి మాత్రం ప్రస్తుత పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కే మొగ్గుచూపుతున్నారు. ఈరోజో, రేపుఅధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముంది.

కొత్త డీజీపీగా మహేందర్ రెడ్డి.....

ఇక ప్రస్తుత డీజీపీ గా ఉన్న అనురాగ్ శర్మ సేవలను కూడా కేసీఆర్ వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర అంతర్గత భద్రతాసలహాదారుడిగా అనురాగ్ శర్మను నియమించనున్నారు. నూతన డీజీపీ నియామకం తర్వాత ఐపీఎస్ లో భారీ ప్రక్షాళన చేసే అవకాశముంది. మహేందర్ రెడ్డి డీజీపీగా వెళుతుండటంతో ఆయన స్థానంలో నగర పోలీస్ కమిషనర్ నునియమించాల్సి ఉంటుంది. ఇందులో జితేందర్, అంజన్ కుమార్, పూర్ణచందర్, శివధర్ రెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి. అయితే ఇందులో జితేందర్ లేదా అంజన్ కుమార్ లకే ఛాన్స్ ఉంటుందని, శివధర్ రెడ్డిని అదనపు సీపీ సమన్వయంగా నియమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. రాజీవ్ త్రివేదీని ఏసీబీ డీజీపీగా, తేజ్ దీప్ కౌర్ ను జైళ్ల శాఖడీజీగా, కృష్ణ ప్రసాద్ ను ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించనున్నట్లు సమాచారం. కొత్త డీజీపీ నియామకం తర్వాత పోలీసు శాఖలో పెద్దయెత్తున మార్పులు చోటుచేసుకుంటాయనితెలుస్తోంది.

Similar News