లోక్‌సభలో విజయవాడ ఎంపీలకు కాలం కలిసి రావడం లేదు. వారు అక్కడ ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడమో లేదా ఇతరత్రా అంశాలతో లోక్‌సభ సాక్షిగా వార్తల్లో కెక్కుతున్నారు. నాడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న లగడపాటి రాజ్‌గోపాల్ సమైక్యాంధ్ర కోరుతూ, రాష్ట్ర విభజన నిరసిస్తూ లోక్‌సభలో ఏకంగా పెప్పర్ స్ప్రే చల్లి నానా హంగామా చేశారు. అప్పుడు కొందరు తెలంగాణ ఎంపీలు లగడపాటిపై ఎటాక్‌కు ట్రై చేశారు. అయితే వారి నుంచి ఆయన తప్పించుకున్నా ఆయనకు చిన్నపాటి దెబ్బలు మాత్రం తప్పలేదు.
గతంలో రాజగోపాల్....
ఇక ఇప్పుడు అగదే విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని సైతం లోక్‌సభలో దెబ్బలు తిన్నారు. ఇక అసలు మ్యాటర్‌లోకి వస్తే ఏపీకి నాలుగేళ్లుగా జరుగుతోన్న అన్యాయంపై టీడీపీ పోరుబాట పట్టింది. ఇప్పటి వరకు బీజేపీ మిత్రపక్షం కావడంతో టీడీపీ మిత్రధర్మం పాటిస్తూ వస్తోంది. అయితే తాజాగా కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరగడంతో ఏపీ టీడీపీ ఎంపీలు పార్లమెంటు సాక్షిగా నిరసనలు, ఆందోళనలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు కేశినేని నాని...
రెండు రోజులుగా జరుగుతోన్న ఈ ఆందోళనల్లో మంగళవారం ఏకంగా 6 గంటల పాటు లోక్‌సభ వెల్‌లోనే నిలబడి వీరు ప్ల కార్డులు చేతబూని మరీ నిరసన తెలిపారు. ఈ నిరసనల్లో ఎంపీ కేశినేని నాని సైతం ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతుండగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ నేత మల్లిఖర్జున ఖర్గే రాష్ట్రపతి ధన్యవాద దీర్మానంపై ప్రసంగించేందుకు రెడీ అవుతుండగా టీడీపీ ఎంపీలు మరింతగా రెచ్చిపోయి నినాదాలు చేస్తున్నారు. ఎంపీ నాని అయితే ఖర్గేకు ఎదురుగా వచ్చి ఆయన కనిపించకుండా ప్ల కార్డులు అడ్డంగా పెట్టారు. దీంతో ఖర్గే నానిని వీపుపై రెండు దెబ్బలు చరిచారు. అయితే అదే టైంలో సోనియా ఖర్గేను కనుసైగలతో వారించడంతో ఆయన శాంతించారు. ఆ వెంటనే నాని కూడా నన్ను ఎందుకు కొడతావ్ అని కాస్త గట్టిగా ప్రశ్నించడంతో ఖర్గే సారీ అని చెప్పి సైలెంట్ అయ్యారు. లోక్‌సభలో విజయవాడ ఎంపీలకు ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో అదో సెంటిమెంట్ అయ్యింది.