కేంద్రం.... ఇక కాస్కో

Update: 2018-03-14 13:30 GMT

‘‘జనసేన ఆవిర్భావానికి ముఖ్య కారణం సమకాలీన రాజకీయ వ్యవస్థ ప్రజలను వంచించి, ప్రజలను మోసంచేసి, ప్రజలను మభ్యపెట్టి వాళ్ల పబ్బం గడుపుకుంటుంటే ప్రజల పక్షాన నిలబడటానికే మీ అన్నగా, మీ తమ్ముడిగా మీ ముందుకు వచ్చా. జనసేన పార్టీ పెట్టా. నాలుగు సంవత్సరాలయింది. కేంద్రం అంటే మనవాళ్లకు భయం. పిరికితనం. ఎవరికి ఉంటుంది భయం. దోపిడీ చేసే వాళ్లకు భయం ఉంటుంది. మనకెందుకు భయం. టంగుటూరి ప్రకాశం పంతులు వారసులం. మనకెందుకు భయం? సమస్యలపై పోరాటం చేయడం నాకు ఇష్టం.’’ అని పవన్ జనసేన ఆవిర్భావ సభలో చెప్పారు.

గుండెలు మండుతున్నాయి....

ప్రత్యేక హోదా పై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనకు పవన్ ఇంగ్లీష్ లో సమాధానమిచ్చారు. ‘‘అరుణ్ జైట్లీగారూ...నేను పవన్ కల్యాణ్ ను....అమరావతి నుంచి మాట్లాడుతున్నాసెంటిమెంట్ తో ప్రత్యతేక హోదా ఇవ్వలేమన్నారు. మీప్రకటన మా గుండెల్ని మండిస్తుంది. అదే సెంటిమెంట్ తో తెలంగాణ ఇచ్చారు. ప్రత్యేకహోదా సెంటిమెంట్ ఏపీకి ఉండదా? మీ చట్టాలను మేం ఎందుకు గౌరవించాలి. చట్టాలు మాకే కాని మీకు కాదా? నాలుగేళ్ల నుంచి జరగుతున్న అన్యాయం మమ్మల్ని బాధపెట్టింది. అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విడదీశారు. పాతిక మంది ఎంపీలతోటి ఐదు కోట్ల మంది ప్రజలను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సి ఉంది. ’’ అని పవన్ అన్నారు.

వారిద్దరి భయాలు వారికున్నాయి....

‘‘చంద్రబాబు, జగన్ లకు వాళ్ల భయాలు వాళ్లకు ఉండొచ్చు. మీరు సీబీఐ కేసులు పెడతారని మిగతా వారికి భయం ఉండొచ్చు. కాని నాకు అటువంటి భయాలు లేవు. కాకినాడ తీర్మానం ప్రకారమే మీరు రాష్ట్రాన్ని విభజించారు. ప్రత్యేక హోదా ఇచ్చారు. హోదా అనేది డబ్బుల సమస్యతో కాదు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మేము దీక్షలు చేయం. జాతీయ రహదారులను దిగ్భంధనం చేస్తాం. ఆంధ్రుల సత్తా ఏంటో చూపిస్తాం. 2014లో మీకు అధికారం ఇచ్చింది మమ్మల్ని తొక్కించుకోవడానికా? ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే కంచే చేను మేస్తుందనిపిస్తోంది. నేను ఒక ముఖ్యమంత్రి కొడుకును కాదు...అల్లుణ్ని కాదు. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకును. రాజకీయాల్లో బాధ్యతగా వ్యవహరించాలి.’’ అని పవన్ అన్నారు.

Similar News