కేంద్ర వైఖరిపై టీడీపీలో అసహనం

Update: 2018-03-07 03:47 GMT

కేంద్ర వైఖరిపై టీడీపీ అసహనం వ్యక్తం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్న టీడీఎల్పీలో జరిగిన సమావేశం గురించి చంద్రబాబు ఎంపీలకు తెలిపారు. 95 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని కోరుతున్నారని చెప్పారు. అయితే విభజన హామీల అమలు కోసం పారాటం కంటిన్యూ చేయాలని చంద్రబాబు ఎంపీలను ఆదేశించారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ ఆందోళలను కొనసాగించాలన్నారు. ఇందుకు టీడీపీ ఎంపీలు కూడా కేంద్రం ఇక సహకరించదని చెప్పారు. పోలవరానికి ఇచ్చిన నిధులపై ఎప్పటికప్పుడు లెక్కలు చెబుతున్నా కేంద్రం లెక్కలు చెప్పలేదనడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. రెవెన్యూ లోటు కింద ఇచ్చిన నిధులకు ఎలా లెక్క చెబుతామని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తుంటే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సీట్లో నుంచి కూడా లేవలేదన్న విషయాన్ని ఎంపీలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాని సభలో ఉంటే బయట గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్నారని, ప్రధాని లేకుంటే లోపల నిరసనలు వైసీపీ ఎంపీలు చేస్తున్నారని చెప్పారు. వైసీపీ డ్రామాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. రాష్ట్రానికి ఏమీ చేయబోమని పరోక్షంగా కేంద్రం చెబుతోందని, ఆర్థిక శాఖ అధికారుల ద్వారా లీకులివ్వడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News