కూచిభొట్ల హత్య కేసులో ...!

Update: 2018-05-06 03:30 GMT

2017 ఫిబ్రవరి లో అమెరికాలో జరిగిన జాత్యంహకార చేసిన దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న కూచిభొట్ల శ్రీనివాస్ కేసులో నిందితుడు ఆడమ్ కి జీవిత ఖైదు విధించింది కోర్టు . యుఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కూచిభొట్ల హత్య కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర స్థాయి లో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో జాత్యహంకార దాడులను ఖండిస్తూ ప్రజలు రోడ్డెక్కారు. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన కొద్దికాలంలోనే జరిగిన ఈ సంఘటన ఆయనకు చుట్టుకుంది. దాంతో అధ్యక్షుడికి వివరణ ఇవ్వలిసిన పరిస్థితి తలెత్తింది.

ఏడాదిలోనే విచారణ పూర్తి అయ్యి ...

ఇలాంటి హత్య కేసులు ఇండియా లో విచారణ జరిగితే నిందుతుడు, సాక్షులు కాలం చేసే వరకు కోర్టుల్లో సాగతీత రొటీన్ గా జరుగుతుంది. కానీ యుఎస్ లో ఈ కేసు ను దాదాపు ఏడాదిలో విచారణ పూర్తి చేసిన కోర్టు శిక్షను సైతం ఖరారు చేసింది. జాత్యాహారంకార దాడి గానే కేసును నిర్ధారించింది. వేగవంతమైన న్యాయవిచారణ కారణంగా బాధిత పక్షానికి కొంతయినా స్వాంతన చేకూరుతుంది.

కొందరైనా మారుతారు అంటున్న శ్రీనివాస్ భార్య ...

యుఎస్ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల శ్రీనివాస్ భార్య సునయన స్పందించారు. ఇప్పుడు ఏమి జరిగినా తన భర్త తిరిగి రాడని వ్యాఖ్యానించింది. కానీ జాత్యంహకారులకు ఈ తీర్పు గుణపాఠం కావాలని అవుతుందని సునయన పేర్కొంది. ఈ కేసులో నిందితుడు ఆడమ్ మరో రెండు హత్యకేసులతో కలిపి పద్నాలుగేళ్ళ శిక్షను కోర్ట్ విధించింది.

Similar News