కిక్కు కోసం ఫుల్లుగా తాగి ముగ్గురి జీవితాలను...?

Update: 2018-01-08 02:09 GMT

ఇంట్లో అంతా బాగా చదువుకున్న వారే...తాగి కారు నడిపితే దొరికిపోతామని తెలుసు...అయినా చిత్తుగా తాగాలి...పోలీసులకు దొరక్కుండా ఇంటికి వెళ్లాలి..అప్పుడుండే కిక్కే వేరు...జూబ్లీహిల్స్‌ రోడ్‌ యాక్సిడెంట్‌లోనూ అచ్చంగా అదే జరిగింది..బట్‌ ప్లాన్‌ తిరగబడి... ముగ్గురి జీవితాలను సమాధి చేసింది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ యాక్సిడెంట్‌లో ఓ మహిళ మృతికి కారణమయ్యాడు.. మరో మహిళ చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడేలా చేసాడు...మరో మహిళ తీవ్ర గాయాలతో ఏంటి నా జీవితం అనుకునేలా చేసాడు . ఈ ముగ్గురి ఆవేదనకు కారకుడు ఒక్కడే...అతడే విష్ణువర్థన్‌.

ఇంట్లో అందరూ విద్యావంతులే....

దుబాయ్‌లో ఇంజనీరింగ్‌ చేసిన ఇతగాడి ఇంట్లో అంతా పెద్ద చదువులు చదువుకున్నవారే . భార్య హైదరాబాద్‌లో పేరున్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. పెద్ద డాక్టర్‌. తల్లి హైకోర్టులో న్యాయవాది . హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఇతగాడు..హిమాయత్‌నగర్‌లో తన సొంత భవంతిలో ఓ ప్లే స్కూల్‌ నిర్వహిస్తూ...భార్యకు అనువుగా ఉంటుందని ఆమె పనిచేసే హాస్పిటల్‌కు దగ్గరలోనే సోమాజిగూడలో ఇల్లు తీసుకుని ఉంటున్నాడు . జూబ్లీహిల్స్‌ రోడ్‌ యాక్సిడెంట్‌కు ముందు..కొండాపూర్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నాడు...ఫుల్‌గా తాగేసాడు. రాత్రి 11 గంటల తరువాత ఇంటికి స్టార్ట్‌ అవుదామనుకున్నా... అసలే వీకెండ్‌...ఇప్పుడు వెళితే డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోతాను...రాత్రి ఒంటి గంట తరువాత స్టార్ట్‌ అయితే...అప్పటి వరకూ డ్రంకెన్‌ డ్రైవ్‌ చేసి పోలీసులు అలిసిపోయి స్టేషన్లకు చేరుకుంటారు...దీంతో నేను సేఫ్‌గా ఇల్లు చేరొచ్చనుకున్నాడు . నిజంగానే..విష్ణువర్దన్‌ అనుకున్నట్టే జరిగింది.

ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుని....

అప్పటి వరకూ జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 10 లో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో..అదే ప్లేస్‌లో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేసారు పోలీసులు..రాత్రి 12.30 వరకూ తనిఖీలు చేసిన పోలీసులకు చాలా మంది మందుబాబులు డ్రైవింగ్‌ చేస్తూ దొరికిపోయారు.. ఆ రూట్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ చెకింగ్స్ జరుగుతున్నాయని ప్రచారం జరగటంతో...అప్పుడే, పోలీసులు అక్కడికి 100 మీటర్ల దూరంలో ఉన్న జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు చెకింగ్‌ పాయింట్‌ను మార్చారు . నిజంగానే మరికొద్ది సేపు ఆ చెకింగ్ పాయింట్‌ జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్‌ 10 లో ఉండుంటే...విష్ణువర్దన్‌ పోలీసులకు దొరికిపోయే వాడు...అలా జరిగినా ఈ ప్రమాదం జరిగేది కాదు..కానీ..కొండాపూర్‌ నుంచి రోడ్‌నెంబర్‌ 10 లోకి ఎంటరై మరికాసేపట్లో సోమాజిగూడలోని తన ఇంటికి చేరుకుంటాను అనుకునేలోపు...మద్యం మత్తులో ఉన్న అతగాడికి కాస్త కునుకు కూడా వచ్చింది . ఇలా కళ్లు మూసి తెరిచే లోపు..రోడ్డుపై కేకలు వినిపిస్తున్నాయి..ఏం జరిగిందో తెలుసుకునేలోగా కారు వెళ్లి డివైడర్‌ను డీకొంది...హోండా యాక్టివాపై ఉన్న ముగ్గురు మహిళలూ రోడ్డుపై రక్తం మడుగులో కనిపించారు... . అంతా అరుపులు..తన కారే యాక్సిడెంట్‌ చేసిందని గుర్తించి...డామిట్‌..11 గంటలకు బయలుదేరినా..ఇది జరిగుండేది కాదేమో అనుకుంటూ నిలబడిపోయాడు .

పోలీసులకు దొరికినా....

పోలీసులకు దొరక్కుండా వెళ్లాలనుకున్నాడే కానీ...తాగి కారు డ్రైవ్‌ చేయొద్దని మాత్రం అనుకోలేదు..ఇంట్లో అంతా చదువుకున్న వాళ్లు ఉండి మాత్రం ఏం లాభం...ఏ చదువూ తెలియని వాళ్లు కూడా...వామ్మో తాగి బండి నడుపొద్దురా అనుకుంటున్నారు...మా అంత మొనగాళ్లు లేరనుకునే ఇలాంటి వారి వల్లే...ఈ డ్రంకెన్‌ డ్రైవింగ్‌లు..రోడ్‌ యాక్సిడెంట్‌లు. విష్ణువర్దన్‌ లాంటి వారిలో మార్పు రానంత కాలం...ఇలా అర్దాంతరంగా జీవితాలు ఆరిపోవాల్సిందే .

Similar News