తాను ఇంతవరకూ ఎటువంటి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వలేదని జస్టిస్ మంజునాధ చెప్పారు. తాను ఇంతవరకూ నివేదిక ఇవ్వలేదని ఆయన చెప్పారు. రిజర్వేషన్లపై తన అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. సభ్యులు ఇచ్చే నివేదిక చట్ట ప్రకారంచెల్లదన్నారు. రిజర్వేషన్ల నిర్ణయంపై తనకు సంబంధం లేదన్న ఆయన ఛైర్మన్ ద్వారానే ప్రభుత్వానికి నివేదిక అందాలన్నారు. అయితే ఇప్పటికే కాపురిజర్వేన్లపై ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంతో మంజునాధ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. మంజునాధ అభిప్రాయం ప్రకారం సభ్యులు ఇచ్చిన నివేదిక లీగల్ గా చెల్లదన్నారు. అయితే ప్రభుత్వం వాదన మరోలా ఉంది. మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని తాము పరిగణనలోకి తీసుకున్నామని చెబుతోంది. తన నివేదికను సోమవారం ప్రభుత్వానికి అందజేస్తానని మంజునాధ చెప్పారు.