కాపు రిజర్వేషన్లకు ఓకే

Update: 2017-12-02 06:03 GMT

కాపులకు బీసీ ఎఫ్ కేటరీగా 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్ 20 నెలల పాటు అన్ని జిల్లాల్లో తిరిగింది. అన్ని ప్రాంతాల నుంచి మంజునాథ కమిషన్ సమాచారం సేకరించింది. కాపుల కోసం రూ.2,100 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు ప్రభుత్వం ఇదివరకే ఏర్పాటుచేసిందన్నారు అచ్చెన్నాయుడు. బీసీ కమిషన్ నివేదికను కూలంకషంగా చర్చించాంమని, కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాలను బీసీల్లో చేర్చాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ఏ ఊరిలో, ఏ కులంలో ఎంతమంది ఉన్నారో సమాచారం సేకరించామని, రాష్ట్రంలో కాపులు 38,09,362 మంది ఉన్నారని, తెలగ 4,81,368, ఒంటరి 13,058, బలిజ 7,51,031 మంది ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. బీసీ కమిషన్ రాష్ట్రమంతా తిరిగిందని, కాపుల్లో 5.8 శాతం మంది గుడిసెల్లో ఉంటున్నారని, కాపు, బలిజ, ఒంటరి, తెలగ 69.3 శాతం మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. కాపు, బలిజ, ఒంటరి తెలగల్లో కేవలం 5.6 శాతం మాత్రమే పట్టభద్రులున్నారని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది.

Similar News