ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ లో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో కాపు కార్పొరేషన్ ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా కాపు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రుణ సౌకర్యంతో పాటు కాపు విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ లను ఇవ్వడమే లక్ష్యంగా ఈ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. అయతే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండేళ్లు గడుస్తున్నా అనుకున్న పురోగతి సాధించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం భావిస్తున్నారు. ముఖ్యంగా కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామాంజుయ ను మార్చాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఆయన స్థానంలో చందు సాంబశివరావును గాని, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను గాని నియమించే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఛైర్మన్ పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగుస్తుండటంతో ఛైర్మన్ మార్చేయాల్సిందేనని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది.
కార్పొరేషన్ లో జరిగిన అవినీతిపై విచారణ…..
ప్రధానంగా నంద్యాల, కాకినాడల్లో కాపు ఓటర్లు తెలుగుదేశం పార్టీ తరుపున నిలబడటంతో కార్పొరేషన్ ను మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే గత కొద్దికాలంగా కార్పొరేషన్ లో పెద్దయెత్తున అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేషన్ ఎండీ అమరేంద్ర కుమార్ పై పెద్దయెత్తున ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణ కమిటీని కూడా నియమించింది. ఎండీ అమరేంద్రకుమార్ ను మార్చాలని ముఖ్యమంత్రి మూడు రోజుల నుంచి చెబుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారులను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిఘా వర్గాలు, పార్టీ నేతలు అందించిన సమాచారం ప్రకారం కాపు కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టినట్లు తెలియడంతో ప్రభుత్వం వెంటనే ఎండీని మార్చేయాలని భావిస్తోంది. ప్రస్తుత ఎండీ అవినీతిపై నియమించిన విచారణ కమిటీ కూడా ఇంతవరకూ నివేదిక సమర్పించక పోవడంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఎండీని సీనియర్ మంత్రి ఒకరు కాపాడుతున్నారన్న టాక్ విన్పిస్తోంది. దీంతో అతి