కాంగ్రెస్ జై కొట్టడం శుభసూచకం

Update: 2016-09-29 11:00 GMT

పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద భారత సైన్యం జరిపిన హఠాత్ దాడులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతివ్వడం, వెన్నుదన్నుగా నిలవడం శుభపరిణామంగా జాతీయ వాదులు భావిస్తున్నారు. పాక్ కు బుద్ధి చెప్పడం అనివార్యంగా మారుతున్న సమయంలో.. భారత సైన్యం బుధవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సైన్యాన్ని సమర్థించింది. వారి చర్యను సాహసోపేతమైన చర్యగా అభివర్ణించింది. అభినందించింది. ఈ విషయంలో అఖిలపక్షం నిర్వహిస్తున్న ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం నుంచి ఈ చర్యకు మద్దతు లభించినట్లే. ఇది శుభసూచకం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అలాగే.. హోం శాఖ ఆధ్వర్యంలో అఖిలపక్షం జరుగుతోంది. రాజ్ నాధ్ సింగ్ ఇప్పటికే పాక్ సరిహద్దుల్లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఫోన్లో మాట్లాడి పరిస్థితులు విషమ రూపం దాలిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.

Similar News