కష్టాల్లో అమెరికా ...

Update: 2018-01-07 03:18 GMT

అమెరికాకు కొత్త ఏడాది ఆరంభం ఏమి బాగోలేదు. తీవ్ర మంచు తుఫాన్ ఇప్పుడు అమెరికాను గడగడలాడిస్తోంది. బాంబ్ సైక్లోన్ గా పేరు పెట్టిన ఈ తుఫాన్ తీవ్రత ప్రస్తుతం తగ్గినా మరో వారంపాటు చలి తీవ్రత అమెరికాను వణికిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు అక్కడివారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాదాపు మైనస్ 65 డిగ్రీల వరకు వర్షంలా కురుస్తున్న మంచు ప్రభావం తీసుకువెళుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దాంతో ప్రజలు బయటకు వచ్చేందుకు సైతం భయపడుతున్నారు. మరోవైపు దూరపు ప్రయాణాలు, వీకెండ్ పార్టీలను సైతం త్యాగం చేసి బతుకు జీవుడా అంటూ కాలక్షేపం చేస్తున్నారు.

కెనడా లో కూడా ....

యుఎస్ తో పాటు సైక్లోన్ ప్రభావం కెనడా మీద కూడా పడింది. అమెరికాలో 19 మంది, కెనడాలో ఇద్దరు ఇప్పటివరకు బాంబ్ సైక్లోన్ ప్రభావంతో ప్రాణాలు వదిలేశారు. న్యూయార్క్, బోస్టన్, నార్త్ కరోలినా ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా వుంది. గత కొంత కాలంగా అమెరికాను చుట్టుముడుతున్న సైక్లోన్ల ధాటికి ప్రజలు విలవిల్లాడుతున్నారు అప్రమత్తంగా వుండాలని యుఎస్ సర్కార్ సైతం ప్రజలకు సూచనలు ఇస్తుంది.

Similar News