టీఆర్ఎస్ ఎంపీ కవితపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. చెల్లెలు కవిత పార్లమెంటులో ఏపీ విభజన హామీలపై జరుగుతున్న ఆందోళనకు కవిత మద్దతు తెలపడాన్ని పవన్ స్వాగతించారు. ఏపీ ప్రజలకు కవిత మద్దతు తెలపడం సంతోషకరంగా ఉందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలకు అండగా నిలబడినందుక పవన్ కవితకు ధన్యవాదాలు తెలిపారు. గతంలోనూ పవన్ 24 గంటల ఉచిత విద్యుత్తును అందించిన సందర్భంగా కేసీఆర్ ను కలిసి ఆయనను ప్రశంసించిన సంగతి తెలిసిందే.